Showing posts with label jibu sir. Show all posts
Showing posts with label jibu sir. Show all posts

Friday, 23 October 2015

మా చిన్నప్పుడు....ఏం జరిగిందంటే....

నేను చిన్నప్పుడు దేవరకొండ లో ఉండేవాడిని. స్కూల్ ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉండేది. రోజు, నేను, వినయ్, రాజశేఖర్, విజేందర్ కలిసి వెళ్ళేవాళ్ళం. మా స్కూల్ ముందు పేద్ద గ్రౌండ్ ఉండేది. స్కూల్ అయిపోగానే, అక్కడే ఉన్నగ్రౌండ్ లో అందరం కలిసేవాళ్ళం. గ్రౌండ్ లో ఆదుకుని ఇంటికి వచ్చేసరికి భాగా అలిసి పోయేవాళ్ళం.

మల్లి తినేసి పడుకుంటే ఉదయం వచ్చేది.
ఇలా గడుస్తున్న మారోజుల్లో ఒక రోజు వింత జరిగింది.
జిబు సర్ & సేలేన్ మేడం మా స్కూల్ లో జాయిన్ అవ్వడం.వాళ్ళు కేరళ వాళ్ళు. కేరళలో పెళ్లి చేసుకుని, టీచింగ్ మీద ఉన్న ఇష్టం తో మా స్కూల్ కి వచ్చారు. చాల ముచ్చటగా ఉండేవారు.
వాళ్ళ ఇంటికి మేమంతా సాయంత్రం tution కి వెళ్ళేవాళ్ళం. మేం వెళ్ళే సరికి అక్కడ ఉన్న ఐవా టీవీ సౌండ్ మోత వినిపించేది.